| కీర్తనలు | శ్యామా శాస్త్రి | నీవే గతియని (వర్ణమ్) |
| కల్యాణి - తిశ్ర మఠ్యమ్ |
| పల్లవి: |
| నీవే గతియని నెర నమ్మినాను జగదంబ నీవనాథరక్షకి మాయమ్మా॥ |
| అను పల్లవి: |
| రావే వేగమే మనవి వినమ్మా శ్రీరాజరాజేశ్వరీ దేవీ॥ |
| చరణము(లు): |
| కామకోటి పీఠనివాసిని కల్యాణిశ్యామకృష్ణసోదరి దేవి నీదు చరితము వినివిని పాదకమలమును కోరితిని సదా గతియని పొగడి పొగడి శరణము గొలిచేనమ్మా బంగారు కామాక్షి॥ |