| కీర్తనలు | శ్యామా శాస్త్రి | పరాకేల నన్ను పరిపాలింప మురారి సోదరి అంబా |
| కేదారగౌళ - ఆది |
| పల్లవి: |
| పరాకేల నన్ను పరిపాలింప మురారి సోదరి అంబా॥ |
| అను పల్లవి: |
| నిరాదరణ సేయ రాదమ్మా శివే పరాశక్తి నా మొఱ నాలకింప॥ |
| చరణము(లు): |
| ధరాద్యఖిలమునకు రాణి హరి హరాదుల పొగడు పరాత్పరి దురంత మహిషాసుర దమని స్మరాధీనుడౌ శ్యామకృష్ణనుత॥ |