| కీర్తనలు | శ్యామా శాస్త్రి | పార్వతీ నిన్ను నే నెఱనమ్మితి |
| కల్గడ - ఆది, తిశ్ర గతి |
| పల్లవి: |
| పార్వతీ నిన్ను నే నెఱనమ్మితి శుకపాణి బ్రోవు పరాకికనేల సుశీలే॥ |
| అను పల్లవి: |
| గీర్వాణ వందిత పదసారస సంగీతలోలే సుగుణజాలే జాలమేలే కామాక్షీ॥ |
| చరణము(లు): |
| భండదైత్య ఖండనాఖండల వినుతా మా ర్తాండ కోటితేజ నీరజాక్షి నిఖిలసాక్షి॥ |
| ఇందువదనా కుందరదనా సింధురగమనా మక రంద వాణీ నీలమేఘవేణీ గీర్వాణీ॥ |
| శ్యామకృష్ణ సోదరీ శివశంకరీ గౌరీ గుణ ధామ కామపీఠవాసినీ శాంభవీ మృడానీ॥ |