| కీర్తనలు | శ్యామా శాస్త్రి | పాలించు కామాక్షి పావనీ పాపశమనీ అంబ |
| మధ్యమావతి - ఆది |
| పల్లవి: |
| పాలించు కామాక్షి పావనీ పాపశమనీ అంబ॥ |
| అను పల్లవి: |
| చాల బహువిధముగా నిన్ను సదా వేడుకొనేడి నా యందేల ఈలాగు జేసేవు వెత హరించవే వేగమే నన్ను॥ |
| చరణము(లు): |
| స్వాంతంబులోన నిన్నే దలచిన సుజనులకెల్ల నీవేళ సంతోషములొసగేవని నీవు మనోరథ ఫలదాయిని వని కాంతమగు పేరు పొందితివి కారుణ్యమూర్తివై జగము కాపాడిన తల్లి గదా నేను నీదు బిడ్డను లాలించి॥ |
| ఈ మూర్తి ఇంత తేజోమయమై యిటువలే కీర్తి విస్ఫూర్తి నిట్లను గుణమూర్తి త్రిలోకములో జూచినా ఎందైన గలదా ఏమో తొలి నోము నోచితినో నీ పాదపద్మ దర్శనము వేమారు లభించి కృతార్థుడనైతి నా మనవినాలకించి॥ |
| రాజాధి రాజన్మకుటీతట మణిరాజపాదా నే జాల నిజసన్నిధిని కోరి సమస్తజనులకెల్ల వరదా రాజముఖీ శ్యామకృష్ణనుతా కాంచీపురేశ్వరీ వికస రాజీవదళాక్షీ జగత్సాక్షీ ఓ ప్రసన్న పరాశక్తీ॥ |
| స్వరము(లు): |
| కనకగిరిసదన లలిత నిను భజన సంతతము సేయ నిజముగను వినుము నిఖిల భువనజననివని యిపుడు మా దురితము దీర్చి వరాలిచ్చి॥ |