| కీర్తనలు | శ్యామా శాస్త్రి | పాలింపవమ్మా పరమపావనీ భవానీ |
| ముఖారి - ఆది |
| పల్లవి: |
| పాలింపవమ్మా పరమపావనీ భవానీ॥ |
| అను పల్లవి: |
| శ్రీ లలితా గుణశీలములను విని చాల నీ సేవజేయ కోరి వచ్చితి॥ |
| చరణము(లు): |
| నీ సమానదైవము నేగాన నిఖిలలోకజననీ మాయమ్మా శ్రీ స్వయంభునాథ తరుణీ మధురవాణీ నీ దాసుని బ్రోవ ఇంత పరాకేలనమ్మా॥ |
| నా తాపము దీర్చి ప్రేమజూచి నిదానముగ మాట్లాడ సమయమిదే గదా జెప్పవమ్మా మాయమ్మా సదా నీ జపమే గతియని నమ్మినానమ్మా॥ |