| కీర్తనలు | శ్యామా శాస్త్రి | బిరాన వరాలిచ్చి బ్రోవుము నెఱ నమ్మితి |
| కల్యాణి - రూపకం |
| పల్లవి: |
| బిరాన వరాలిచ్చి బ్రోవుము నెఱ నమ్మితి॥ |
| అను పల్లవి: |
| పురారి మనోహారిణీ శ్రీ కామాక్షి॥ |
| చరణము(లు): |
| తామసము సేయక నీవు కరుణానిధి గాదా పరాముఖమికనేల విను సరోజముఖి॥ |
| కామితార్థఫల దాయకి దేవి కల్పలతికా పురాణి మధురవాణి శివునికి రాణి॥ |
| శ్యామకృష్ణ సోదరి గౌరి పరమేశ్వరి గిరిజా అనాథ రక్షణంబు సలుపగ రావే॥ |