| కీర్తనలు | శ్యామా శాస్త్రి | బ్రోవ సమయమిదే దేవీ విను |
| పున్నాగవరాళి - ఆది |
| పల్లవి: |
| బ్రోవ సమయమిదే దేవీ విను దేవరాజనుతా పరదేవతా అంబా॥ |
| అను పల్లవి: |
| భావజారి రాణీ భక్తపాలినీ భవానీ బృహదంబా నను॥ |
| చరణము(లు): |
| అంబుజదళనయనా విధు బింబనిభాననా గజగమనా అంబికే పరాకుసేయతగునా బింబాధరీ గౌరీ కుందరదనా॥ |
| అంబరచరవినుతా కదంబవనప్రియా శ్రీ లలితా కంబుగళా వరదాననిరతా తుంబురు నారదనుతా సంగీతరదా॥ |
| శ్యామగిరితనయా గుణధామ కరధృతమణి వలయా సోమకలాధరి శివప్రియా శ్యామకృష్ణహృదయాంబుజనిలయా॥ |