| కీర్తనలు | శ్యామా శాస్త్రి | బ్రోవవమ్మా తామసమేలే బిరాన |
| మాంజి - మిశ్ర చాపు |
| పల్లవి: |
| బ్రోవవమ్మా తామసమేలే బిరాన బ్రోవవమ్మా తామసమేలే అంబా దేవీ తాళలేనే బిరాన॥ |
| అను పల్లవి: |
| నీవే అనాదరణ జేసితే అంబా నిర్వహింప వశమా కామాక్షి॥ |
| చరణము(లు): |
| జాలమేల వినోదమా శివశంకరి ఇది సమ్మతమా శూలినీ నీవే భక్త పరిపాలినీ గదా బిరాన॥ |
| దీనరక్షకి నీవేయని నీ దివ్యనామమే ధ్యానము వేరే మంత్ర జప తపములెరుగనే బిరాన\॥ |
| శ్యామకృష్ణ సహోదరీ శుకశ్యామళే త్రిపుర సుందరి అంబా ఈ మహిలో నీ సమాన దైవము నెందుగానలేనే బిరాన॥ |