| కీర్తనలు | శ్యామా శాస్త్రి | మాయమ్మా నన్నుబ్రోవవమ్మా మహామాయా ఉమా |
| నాటకురంజి - ఆది |
| పల్లవి: |
| మాయమ్మా నన్నుబ్రోవవమ్మా మహామాయా ఉమా॥ |
| అను పల్లవి: |
| సత్యానందా సానందా నిత్యానందా ఆనందా అంబా॥ |
| చరణము(లు): |
| శ్యామకృష్ణజననీ తామసమేల రావే దేవీ శ్యామలే నీలోత్పలే హిమాచలసుతే సుఫలే శివే॥ |
| స్వరము(లు): |
| మాధవాదివినుతే సరసిజాక్షి కంచికామాక్షి తామసము సేయక రమ్మా మరకతాంగి మహాత్రిపురసుందరి నిన్నే హృదయము పట్టుకొని॥ |