| కీర్తనలు | శ్యామా శాస్త్రి | మాయమ్మా యని నే పిలిచితే |
| ఆహిరి - ఆది |
| పల్లవి: |
| మాయమ్మా యని నే పిలిచితే మాట్లాడరాదా నాతో అంబా॥ |
| అను పల్లవి: |
| న్యాయమా శ్రీ మీనాక్షి నీకిది నిన్నువినా వేరే దిక్కెవరున్నారు॥ |
| చరణము(లు): |
| సరసిజభవ హరిహర నుత సులలిత నీ పదపంకజముల స్థిరమని నమ్మితి నమ్మితి నమ్మితిని కరుణజూడవే కాత్యాయని కాళికా భవాని పరమేశ్వరి సుందరేశు రాణి బాలాంబా మధురవాణి॥ |
| వినుతజన పాపవిమోచని ఓ జనని ఘన నీలవేణి విదళిత దానవ మండల దమని వనజలోచనా సుధాకరాననా వరదాయకి అనయము నిన్ను కోరియున్నానమ్మా బంగారు బొమ్మా॥ |
| అభయమొసగి నన్ను బ్రోవుము ఓ వరదా నెఱదాతవు గదా అంబికా బిడ్డపై గొప్పగ దయ రాదా అఖిలలోకజనని అనాథరక్షకి అనేటి బిరుదు గాదా వైభవముగల శ్యామకృష్ణసోదరి వీరశక్తి త్రిపురసుందరి॥ |