| కీర్తనలు | శ్యామా శాస్త్రి | మీనలోచని బ్రోవయోచనా దీనజనావనా |
| ధన్యాసి - మిశ్ర చాపు |
| పల్లవి: |
| మీనలోచని బ్రోవయోచనా దీనజనావనా అంబా॥ |
| అను పల్లవి: |
| గానవినోదిని నీ సమానము జగాన గాననమ్మ అంబ॥ |
| చరణము(లు): |
| కన్నతల్లి గదా నా విన్నపము వినవమ్మా పన్నగభూషణునికి రాణీ నిన్నువినా ఇలలో దాత వేరెవరున్నారమ్మా బంగారు బొమ్మా॥ |
| ఇందుముఖీ నీవు వరములొసగి నాముందువచ్చి దయసేయవమ్మా కుంద ముకుందరదనా హిమగిరికుమారీ కౌమారీ పరమేశ్వరీ॥ |
| సామజగమనా నీవు తామసము సేయక శ్యామకృష్ణసోదరీ రావే కామపాలినీ భవానీ చంద్ర కలాధారిణీ నీరదవేణీ॥ |