| కీర్తనలు | శ్యామా శాస్త్రి | రావే పర్వతరాజకుమారీ దేవీ నన్నుబ్రోచుటకు వే వేగమే |
| కల్యాణి - ఝంప |
| పల్లవి: |
| రావే పర్వతరాజకుమారీ దేవీ నన్నుబ్రోచుటకు వే వేగమే॥ |
| అను పల్లవి: |
| నీవే గతియని నమ్మియుంటి గదా నా మొఱలిడగా జెప్పవమ్మా మా తల్లి॥ |
| చరణము(లు): |
| ధీర కుమార వందితపదా నీరదవేణి త్రిలోకజనని నీను గదా నారదాదినుత శుభచరితా ఉదార గుణవతీ పదాంబుజములే శరణంటి॥ |
| మీనలోచనీ కృపజూడవమ్మా దీనరక్షకియని బిరుదు నీకు తగు దానవరిపుతోషిణి పురాణీ అభయ దానమీయవే శ్యామకృష్ణసోదరీ॥ |