| కీర్తనలు | శ్యామా శాస్త్రి | రావే హిమగిరికుమారి కంచికామాక్షి వర (స్వరజతి) |
| తోడి - ఆది |
| పల్లవి: |
| రావే హిమగిరికుమారి కంచికామాక్షి వర దా మనవి వినవమ్మ శుభమిమ్మా మాయమ్మ॥ |
| స్వరము(లు): |
| నతజన పరిపాలిని వనుచు నమ్మితిని సదా బ్రోవ। |
| మదమత్త మహిషదానవమర్దని వెతదీర్చవే దురముగను। |
| కామపాలిని నీవే గతియని కోరితి కొనియాడితి వేడితి। |
| కామితార్థఫలదాయకి యనేటి బిరుదు మహిలో నీకే తగు। |
| కమలముఖి దరగళ ఘననీలకచ భరా మృగవిలోచన మణిరదనా గజగమనా మదిలో నిను సదా దలచుకొని నీ ధ్యానమే తల్లి। |
| శ్యామకృష్ణనుత విను నాచింతను వేవేగ దీర్చి అభయమియ్యవె కల్యాణి కంచికామాక్షి నీ పాదమే దిక్కు॥ |