| కీర్తనలు | శ్యామా శాస్త్రి | శ్రీ కామాక్షి కావవే నను కరుణాకటాక్షి |
| కల్యాణి - ఆది |
| పల్లవి: |
| శ్రీ కామాక్షి కావవే నను కరుణాకటాక్షి శ్రీ కాంతిమతీ శ్రీ కాంచీపురవాసినీ॥ |
| అను పల్లవి: |
| ఏకామ్రేశ్వరి నీకు ఏలాకు దయవచ్చునో లోకులు కోరిన దైవము నీవే గాదా ఏకభావుడైన నన్నొకని బ్రోవ బరువా॥ |
| చరణము(లు): |
| కోరివచ్చిన భక్తజనులకు కోమళాంగి నీవే సామ్రాజ్యము కామాక్షమ్మా నిన్నే వేడిన బిడ్డను కాపాడవమ్మా కరుణజూడవమ్మా సారసదళనేత్రీ కామపాలినీ సోమశేఖరుని రాణీ పురాణీ శ్యామళాంబికే కాళికే కలే సామగానమోదినీ జననీ॥ |
| నీరజలోచనా స్థిరమని భక్తితో నిన్నే శరణంటిన దాసుడు నేను నీ సన్నిధిని జేరిన నాపై నిరీక్షణము చేయ తగునా నీ నామమే ధ్యానమే నియతి వేరే జపతపము లెరుగనే మాయమ్మా నీ సాటెవరు శ్యామళే శివే శ్యామకృష్ణపాలిత జననీ॥ |
| స్వరము(లు): |
| నా మనవి వినుమిక గిరితనయా ముదముతో వచ్చి కోరితి నా వెతలను దీర్చవే మాకభయదానమీయవే తామసము సేయకనే॥ |