| కీర్తనలు | శ్యామా శాస్త్రి | సరి యెవరమ్మా అంబ నీ |
| భైరవి - ఖండ ఝంప |
| పల్లవి: |
| సరి యెవరమ్మా అంబ నీ దయజూడవమ్మా శ్రీ కామాక్షి నీ॥ |
| అను పల్లవి: |
| పరమపావనీ భవానీ దేవీ పరాశక్తి నీవని నమ్మినాను॥ |
| చరణము(లు): |
| మాధవసోదరీ గౌరీ అంబమహాభైరవీ శాంభవీ నాద రూపిణీ జననీ దేవీ నారాయణీ నళినాక్షి॥ |
| రాజరాజేశ్వరీ చిద్రూపీ రాజీవాక్షీ లోకసాక్షీ తేజోమయీ జననీ దేవీ ఓజోవతీ ఓంకారీ॥ |
| పామర పావనీ పార్వతీ దేవీ పాకారివినుతే శ్రీ లలితే శ్యామకృష్ణ పరిపాలినీ దేవీ శ్యామగిరి సుపుత్రి॥ |
| స్వరము(లు): |
| సారసదళనయనా హరిహరసురనుత లలితా నిను సతతము శరణము కోరితిని కమల పాదయుగము నమ్మితి సుందరి శంకరి ఈ జగములో॥ |