| కీర్తనలు | శ్యామా శాస్త్రి | సరోజదళనేత్రి హిమగిరిపుత్రి నీ పదాంబుజములే |
| శంకరాభరణ - ఆది |
| పల్లవి: |
| సరోజదళనేత్రి హిమగిరిపుత్రి నీ పదాంబుజములే సదా నమ్మినానమ్మా శుభమిమ్మా శ్రీ మీనాక్షమ్మా॥ |
| అను పల్లవి: |
| పరాకు సేయక వరదాయకి నీవలే దైవము లోకములో గలదా పురాణీ శుకపాణీ మధు కరవేణీ సదాశివునికి రాణీ॥ |
| చరణము(లు): |
| కోరివచ్చిన వారికెల్లను కోర్కలొసగే బిరుదుగదా అతి భారమా నన్ను బ్రోవ తల్లి కృపాలవాల తాళజాలనే॥ |
| ఇందుముఖి కరుణించమని నిన్నెంతో వేడుకొంటిని నా యందు జాగేలనమ్మా మరియాద గాదు దయావతి నీవు॥ |
| సామగాన వినోదినీ గుణ ధామ శ్యామకృష్ణ నుతా శుక శ్యామళాదేవి నీవేగతి రతి కామ కామ్యద కావవే నన్ను॥ |