| కీర్తనలు | శ్యామా శాస్త్రి | హిమాచలతనయ బ్రోచుటకిది |
| ఆనందభైరవి - చాపు/ఆది |
| పల్లవి: |
| హిమాచలతనయ బ్రోచుటకిది మంచి సమయము రావే అంబా॥ |
| అను పల్లవి: |
| కుమార జనని సమానమెవరిల ను మానవతి శ్రీ బృహన్నాయకి॥ |
| చరణము(లు): |
| సరోజముఖి బిరాన నీవు వరాలొసగుమని నేను వేడితి పురారి హరి సురేంద్రనుత పురాణి పరాముఖమేలనే తల్లి॥ |
| ఉమా హంస గమా తామసమా బ్రోవ దిక్కెవరు నిక్కముగ ను మాకిపుడభిమానము చూపు భారమా వినుమా దయతోను॥ |
| సదా నతవరదాయకి నిజదాసుడను శ్యామకృష్ణ సోదరి గదా మొఱ వినవా దురితవిదారిణి శ్రీ బృహన్నాయకి॥ |