| కీర్తనలు | శ్యామా శాస్త్రి | నన్ను బ్రోవరాదా వేగమే నీవు |
| గౌళిపంతు - మిశ్ర చాపు |
| పల్లవి: |
| నన్ను బ్రోవరాదా వేగమే నీవు॥ |
| అను పల్లవి: |
| విను నామొఱలను నే నీదాసుడు గాదా॥ |
| చరణము(లు): |
| కోరిన వరమిచ్చే దైవము నీవే గాదా? కారుణ్యమూర్తి కౌమారీ గౌరీ శరణాగత జనరక్షకీ శంకరీ సరస మృదుభాషిణీ రాజరాజేశ్వరీ॥ |
| అభయదానమిచ్చే దైవము నీవే గదా అభిరామ గుణమయీ అఖిలాండేశ్వరీ ఆశ్రిత తాపహారిణీ పురాణీ ఆనంద రూపిణీ అళికులవేణీ॥ |
| కామితఫలమిచ్చే దైవము నీవే గదా? పామరపాలినీ భవభయ భంజనీ సోమశేఖర ప్రియ భామినీ రంజనీ శ్యామకృష్ణసోదరి పార్వతి భవాని॥ |