| కీర్తనలు | శ్యామా శాస్త్రి | పురహరజాయే పాలయ మాం |
| గౌళిపంతు - మిశ్ర చాపు |
| పల్లవి: |
| పురహరజాయే పాలయ మాం॥ |
| అను పల్లవి: |
| చరణాంబుజభక్తిం దేహి మే కరుణానిధే నిరామయే మాయే॥ |
| చరణము(లు): |
| అళికులవేణి భవాని పావని కళరవ మృదుతరవాణి శర్వాణి కలిమోచని బాలే కమనీయగుణశీలే తిలకాంచితఫాలే ధృతమణిమాలే॥ |
| భానుకోటి సమాన శరీరే పాలిత ముని నికరే గంభీరే దీనజనపోషిణి నతసుతతోషిణి దైత్యకులశోషిణి సులభే మంజుభాషిణి॥ |
| కామపీఠగతే కల్యాణి కామాక్షి కామితఫలదే శ్రీ లలితే సోమముఖి పురాణి సుందరి కౌమారి శ్యామకృష్ణసోదరి శైలరాజకుమారి॥ |