| కీర్తనలు | శ్యామా శాస్త్రి | దయజూడ మంచి సమయమిదే వే వేగమే వచ్చి |
| జగన్మోహిని - మిశ్ర చాపు |
| పల్లవి: |
| దయజూడ మంచి సమయమిదే వే వేగమే వచ్చి॥ |
| అను పల్లవి: |
| జయమొసగే శంకరీ నీవు జననిగదా బృహదంబా॥ |
| చరణము(లు): |
| కనకాంగీ నీ పాదకమలమే దిక్కని నమ్మినాను నేను సనకసనందన వందిత చరణా సారసనేత్రి నీవు గదా॥ |
| చపలమన్యు దీర్చ్యఖండసామ్రాజ్యమీయవే కపటము సేయకనే నిగమవినుతా కామిత దాయకి నీవుగదా॥ |
| శ్యామకృష్ణ సోదరీ కౌమారీ సకలాగమపూజితే దేవి నీ మహిమలు పొగడ తరమా నీ సమాన మెందుగాననే॥ |