| కీర్తనలు | శ్యామా శాస్త్రి | శ్రీపతిముఖ విరచిత పూజ్యే |
| సావేరి - ఆది |
| పల్లవి: |
| శ్రీపతిముఖ విరచిత పూజ్యే శ్రీ పార్వతి మాం పాహి దేవి॥ |
| అను పల్లవి: |
| నీపవననిలయే నిరామయే నిటిలనయనజాయే మమ హృదయ తాపహారిణి నవరత్నాలయే తాపస వరనారదముదితే దేవి॥ |
| చరణము(లు): |
| తరుణి లతాపల్లవ మృదుచరణే తపన విధువిలోచనే అరుణకోటిసమకాంతియుత శరీరే కలధృతకలాపే సురుచిరమణికంఠలసన్మణిహారే సుగుణశీలే సతతం సముదం కరుణయా అవ దీనం పరదేవతే కామకోటిపీఠగతే లలితే॥ |
| కరిముఖ కార్తికేయ జనని స్వరపాలిని పావని హరిసహోదరి విదళిత దైత్యారిగణే సదా పూర్ణే పరమేశవినుతే శ్రితజనపాలితే ప్రీతిరిహ వసతు విమలే పురహరప్రియే శశినిభాననే పూర్ణకామే సామగానలోలే॥ |
| శ్యామళాంగి మంజుళవాణి సకలభయనివారిణి హే మహేశ్వరి మధుపసదృశవేణి కామేశ్వరి గౌరి శ్యామకృష్ణసోదరి భువనేశ్వరి శాంభవి మహాత్రిపుర సుందరి హిమగిరికుమారి కవికుల కామదే కాంక్షిత ఫలదాయికే॥ |