| కీర్తనలు | శ్యామా శాస్త్రి | నామనవిని విను ఈ వేళ(వర్ణమ్) |
| సౌరాష్ట్రం - చతురశ్ర అట |
| పల్లవి: |
| నామనవిని విను ఈ వేళ బ్రోవు కంచి కామాక్షమ్మా పామరపాలినీ ఓ జననీ కృప జూడ వమ్మా॥ |
| అను పల్లవి: |
| నెమ్మదిని నీ నామమే దిక్కని నిన్నే నమ్మితి నమ్మితి నమ్మితినమ్మా మాయమ్మా॥ |
| స్వరము(లు): |
| పాదకమలములపై గతియని నీ సన్నిధిని వచ్చిన దాసున నన్ను చనువున రక్షించుటకు పరుల ఈ ధరలో తెలిసి తెలియక జేసిన అపరాధములను మన్నించి నీవు మా దురితము దీర్చి దయజూచిపుడు నా మనవిని విను ఈ వేళ బ్రోవు కంచి కామాక్షమ్మా॥ |
| చరణము(లు): |
| భక్తుడైన నాపై ఇంత వాదా మాయమ్మా ముక్తినీయవే శ్యామ కృష్ణనుతా అంబా॥ |