| కీర్తనలు | శ్యామా శాస్త్రి | ఆదినమునించి పొగడి పొగడి ఆశ్రయించి |
| ఆనందభైరవి - త్రిపుట |
| పల్లవి: |
| ఆదినమునించి పొగడి పొగడి ఆశ్రయించి నీమహిమలను పాడలేదా? |
| అను పల్లవి: |
| ఆదిశక్తి నీవని నమ్మినాను నమ్మిన నన్ను ఆదరించలేవా దయలేదా? |
| చరణము(లు): |
| అహిభూషణుని రాణీ పురాణీ భవానీ అళికులవేణీ ఆశ్రిత శ్రేణీ అంబుజలోచని శ్యామకృష్ణపాలితజననీ అఖిలలోకభవానీ శ్యామళాంబికే వరదే అభయదానమీయవే॥ |