| కీర్తనలు | శ్యామా శాస్త్రి | అఖిలాండేశ్వరి దురుసుగ బ్రోవుము |
| కర్ణాటక కాపి - ఆది |
| పల్లవి: |
| అఖిలాండేశ్వరి దురుసుగ బ్రోవుము |
| అను పల్లవి: |
| నిఖిలతాపహారిణీ భువిలోన నినుమించిన వారెవరున్నారమ్మా |
| చరణము(లు): |
| మాణిక్య మయమై యున్న మందిరమధ్యవాసినీ అలి వేణీ శ్రీ శంభునాథుని రాణీ వరమీయవే గీర్వాణీ మాయమ్మా |
| అంభోరుహసంభవ హరి శంకర అఖిలమునీంద్రపూజిత అతి గంభీరా దీనరక్షణి గదా నామొఱలను వినలేదా? |
| ఓ అంబా నిను నమ్మిన నాపై ఇంత పరాముఖమేల విను శ్యామకృష్ణనుతా చింత దీర్చి సామ్రాజ్యమీయవే వేగమే |