| కీర్తనలు | శ్యామా శాస్త్రి | కామాక్షి లోకసాక్షిణీ (గీతమ్) |
| మధ్యమావతి - త్రిపుట |
| 1: కామాక్షి లోకసాక్షిణీ కామారి మనోహారిణీ కామాక్షి కంచికామాక్షి పాహిమామ్ పాహిమామ్ బంగారు పాహి॥ |
| 2: పంకజదళలోచనే ఉమే సంకట భయమోచనే శివే కుంజర సమగమనే రమణే మంజుళతమ నయనే హరిణి॥ |
| 3: భండ దైత్య ఖండన పండితే అండజ హరి గిరీశ మండితే పుండరీక మృదుపదయుగళే మండలస్థితే లలితే వరదే॥ |
| 4: కామకోటి పీఠవాసినీ కామితార్థ శుభఫలదాయికే సామగాన శ్రుతి సమ్మోదిని శ్యామకృష్ణ పాలిత జనని॥ |