| కీర్తనలు | శ్యామా శాస్త్రి | నిన్నే నమ్మితి నిజముగ గతి లోకములో |
| కేదారగౌళ - ఆది |
| పల్లవి: |
| నిన్నే నమ్మితి నిజముగ గతి లోకములో॥ |
| అను పల్లవి: |
| నన్నడ చలుపగ నావిచారము దీర్చి నంబోరుహాననా దివ్యతర జూచి॥ |
| చరణము(లు): |
| నీ మహాత్మ్యము ఎవరే నిదానింప శక్యము గాదుగదా శ్రీ మాతవే నీ ఛాయేతులనొకని గాంచగలనే ఏమని చెప్పుదు దేవీ నుతింప నాదువశమా ఈ మహిలో నీ దయగలిగినా భయంబు తొలిగేనో॥ |