| కీర్తనలు | శ్యామా శాస్త్రి | బృహన్నాయకీ నన్ను బ్రోవు వేగమే |
| మధ్యమావతి - తిశ్ర మఠ్యమ్ |
| పల్లవి: |
| బృహన్నాయకీ నన్ను బ్రోవు వేగమే॥ |
| అను పల్లవి: |
| బృహదంబా నీ మహిమలు బ్రహ్మాది సురులచే పొగడతరమా? |
| చరణము(లు): |
| దేవీ నీవే గతియని అంబా దృఢ భక్తితో పూజించే గదా నా వెత దీర్చవే కరుణజూడ సమయమిదే నీపాదమే గతియనుచు నెఱనమ్మితి॥ |
| దీనరక్షకి నీవని సదా దలచిన దాసుడు నేనుగదా మాకభయ దానమీయవే కామితదాయికే నీ నామమే అనుదినము మఱవకను॥ |
| శ్యామకృష్ణపాలిని గౌరి సులలితే శ్యామళే నాతోవాదా మాయమ్మా ఈ మహిలో నీసమాన దైవమెవరు ఈ వేళను దురముగను వరమొసగు॥ |