| కీర్తనలు | శ్యామా శాస్త్రి | పాలయాశు మాం పరదేవతే |
| ఆరభి - త్రిపుట |
| పల్లవి: |
| పాలయాశు మాం పరదేవతే॥ |
| అను పల్లవి: |
| కాలకాలవల్లభే లలితే అతిలలితే॥ |
| చరణము(లు): |
| గానవినోదినీ నిరంజనీ దానప్రదాయినీ రంజనీ మానోన్నతిం దేహి మే శివే మానవతీ హిమగిరితనయే॥ |
| కంజలోచనే కామాక్షీపంచాక్షర వైభవ ముదితే కామకోటిపీఠ సువాసిని శ్యామకృష్ణ పరిపాలిత జననీ॥ |