| కీర్తనలు | శ్యామా శాస్త్రి | బ్రోవవమ్మా బంగారు బొమ్మా మాయమ్మా నను |
| నీలాంబరి - మిశ్ర చాపు |
| పల్లవి: |
| బ్రోవవమ్మా బంగారు బొమ్మా మాయమ్మా నను॥ |
| అను పల్లవి: |
| బ్రోవవమ్మా నాతో మాట్లాడవమ్మా సార్వభౌమ బొమ్మా కామాక్షమ్మా నను॥ |
| చరణము(లు): |
| శ్యామకృష్ణపూజితా సులలితా శ్యామళాంబా ఏకామ్రేశ్వరప్రియా తామసము సేయకనే కామాక్షమ్మా మాయమ్మా తామసము సేయకనే పరితాపములను పరిహరించి నను॥ |