| కీర్తనలు | శ్యామా శాస్త్రి | సామి నిన్నె నమ్మితిరారా రా ముద్దు కుమారా |
| బేగడ - ఆది |
| పల్లవి: |
| సామి నిన్నె నమ్మితిరారా రా ముద్దు కుమారా॥ |
| అను పల్లవి: |
| నామీద దయ జూచి నన్ను రక్షింప రా వేగమే తామసము జేసితే నిమిషమిక తాళజాలనయ్యా ముద్దయ్యా॥ |
| చరణము(లు): |
| నీ మహిమలు బ్రహ్మాదులనించి నిర్ణయింప తరమౌనా పామరు నేను పొగడ తరమా పతితపావన షడానన నా మనవి వినరా అనయము నీనామమే జపమురా గంభీరా భూమిలో నీసాటి దైవమెవడు నీవే మహానుభావ నన్నుబ్రోవు॥ |
| తాపములనెల్ల ఇక బాపుదువని ప్రాపు కోరితిరా నేను నీ పాదములే దిక్కు లోకములను నిఖిల సంతాపహరణ పాపహరణ సమ్మోహన కలావిధృత శ్రీపతి పద విదిత వేదాంత రూప కోటి మన్మథాంగజిత సరోజనేత్ర ధీర రణధీర॥ |
| కోరియుంటి నీదు సన్నిధిని కోరిన వారికెల్ల దయతోను కోరికలనిచ్చేది నీ బిరుదు గదా కుటిల తారక విదారక సారస చరిత నీ దయరాదా శ్యామకృష్ణనుత వైద్యే శు నీలకంఠ వాహన దీనావన సుహృదయ వాస దరహాస॥ |