| కీర్తనలు | శ్యామా శాస్త్రి | పాహి మాం శ్రీ రాజరాజేశ్వరి అంబ పాహి మాం |
| నాట - రూపకం |
| పల్లవి: |
| పాహి మాం శ్రీ రాజరాజేశ్వరి అంబ పాహి మాం శ్రీ రాజరాజేశ్వరి శ్రీ రాజరాజేశ్వరి శ్రీ రాజరాజేశ్వరి॥ |
| అను పల్లవి: |
| సింహాసనారూఢే దేవతే దృఢవ్రతే సింహాసనారూఢే ఏహి ఆనంద హృదయే॥ |
| చరణము(లు): |
| కామితార్థ ఫలదాయికే అంబికే కాళికే కామితార్థ ఫలదాయికే కామకోటి పీఠగతే॥ |
| మానవ మునిగణ పాలినీ మానిని జనని భవాని మానిత గుణశాలిని నిరంజని నిఖిలపాప శమని॥ |
| సారసపదయుగళే స్వరజతి కల్పిత సంగీ త రసికే నటప్రియే బాలే సురభి పుష్ప మాలే॥ |
| శారదే సామగాన సమ్మోదితకరి శ్రీ చక్ర రాజేశ్వరి సులయకరి శ్యామకృష్ణ సోదరి॥ |