| కీర్తనలు | శ్యామా శాస్త్రి | దేవీ బ్రోవ సమయమిదే |
| చింతామణి - ఆది |
| పల్లవి : |
| దేవీ బ్రోవ సమయమిదే అతివేగమేవచ్చి నా వెతలు దీర్చి కరుణించవే శంకరీ కామాక్షి॥ |
| చరణము(లు): |
| లోకజననీ నాపై దయలేదా మాయమ్మా నీ దాసుడుగదా స్రీ కాంచివిహారిణీ కల్యాణీ ఏకామ్రేశ్వరుని ప్రియభామయైయున్న నీ కేమమ్మా ఎంతో భారమా వినుమా నా తల్లి॥ |
| రేపు మాపని చెప్పితే నే వినను దేవి ఇక తాళను నేను ఈ ప్రొద్దు దయచేయవే కృపజూడవే నీ పదాబ్జములే మదిలో సదా యెంచి నీ ప్రాపు కోరియున్నానమ్మా ముదముతో మా తల్లి॥ |
| శ్యామకృష్ణుని సోదరి కౌమారి శంకరి బింబాదరి గౌరి హేమాచలజే లలితే పరదేవతే కామాక్షి నిన్నువినా భూమిలో ప్రేమతో కాపాడే వారెవరున్నారమ్మా నా తల్లి॥ |