అధ్యాత్మ సంకీర్తన
రేకు: 195-5
సంపుటము: 2-490
రేకు: 195-5
సంపుటము: 2-490
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేవగాంధారి
| అడ్డము చెప్పగరాదు అవుఁగాదనఁగరాదు వొడ్డిన దనుభవించే దోపిక జీవులది | ॥పల్లవి॥ |
| యీరికలెత్తె జన్మము లిన్ని జంతువులయందు కోరికల గొనసాగెఁ గోటానఁగోటి నారుకొనె సంపదలు నానారూపములై తీరదేమిటా నీచిక్కు దేవుఁడు వెట్టినది | ॥అడ్డ॥ |
| అల్లుకొనెఁ గర్మములు అక్కడికి నిక్కడికి వెల్లవిరాయను మాయ వెనకా ముందు కెల్లురేఁగె దేహమందే కిమ్ముల చుట్టరికాలు పొల్లువో దెన్నఁడు భూమి పుట్టగాఁ బుట్టినది | ॥అడ్డ॥ |
| పండెను సంసారము ఫలమైన నానాఁటికి నిండెను నాలికకు నెమ్మదిఁ జవులు అండనే శ్రీవేంకటేశుఁ డంతర్యామై వుండి వండ వండనట్లుగ (?) వన్నె కెక్కెంచినది | ॥అడ్డ॥ |


