అధ్యాత్మ సంకీర్తన
రేకు: 195-6
సంపుటము: 2-491
రేకు: 195-6
సంపుటము: 2-491
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శంకరాభరణం
| ఎంతకెంత యిది యేమని పొగడుట యింత సేయ నీకు నెదురా వీరు | ॥పల్లవి॥ |
| పిడుగులఁ బోలెడి పెను నీ నఖములఁ కెడయక హిరణ్యుఁ డెట్లుండెనో వుడికెటి చక్రాయుధము వేఁడికిని జడియక మకరెటు వహించెనో | ॥ఎంత॥ |
| శరపరంపరల శిరములు నఱకఁగ యెరగొని రావణుఁ డేమనెనో పరియలు వారఁగ బ్రహ్మాండభాండము ఉరుశంఖరవం బోర్చుట యెట్లో | ॥ఎంత॥ |
| గాఁటపు నిష్ఠురగదాహతికి మధు- కైటభుల తలల కత లెట్లో యీటున శ్రీవేంకటేశ నీకృపను పాటించి దాసులు బ్రదుకుట యెట్లో | ॥ఎంత॥ |


