అధ్యాత్మ సంకీర్తన
రేకు: 196-1
సంపుటము: 2-492
రేకు: 196-1
సంపుటము: 2-492
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేవగాంధారి
| నీయంత నీవే యెరిఁగి నిచ్చ నన్నుఁ గాతు గాక మాయలలోఁ బొరలే దిమ్మరివాఁడ నేను | ॥పల్లవి॥ |
| నీ సరివాఁడనా నిన్ను దూరేవాఁడనా దాఁసుడనై కొలిచిన తనుధారిని వేసరించ నోపుదునా వెరపించఁగలనా మాసిన పాపాలలోని మైల సోఁకినాఁడను | ॥నీయం॥ |
| విన్నవించేవాఁడనా వీడుజోడువాఁడనా అన్నిటా శరణుచొచ్చినట్టి జీవిని యెన్నిటి కుత్తరమిచ్చే యేపని సేసి మెప్పించే మున్నిటి కర్మములకు ముంగిట నున్నాఁడను | ॥నీయం॥ |
| యెదురాడేవాఁడనా యెలయించేవాఁడనా సదరాన నీకు మొక్కేజంతువ నేను ఇదివో శ్రీవేంకటేశ యెరుక నీ వొసగఁగా పొదిగి నీమహిమలు పొగడుచున్నాఁడను | ॥నీయం॥ |


