అధ్యాత్మ సంకీర్తన
రేకు: 197-6
సంపుటము: 2-501
రేకు: 197-6
సంపుటము: 2-501
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
| బయలు మొరంగగు పరమమాయ ఇది నయమున లోనై వగతురు గాని | ॥పల్లవి॥ |
| కలఁడు హరి యొకఁడు కావ జగములకు కలిగినతఁడు లేక మానఁడు తెలిసి ఇందరికిఁ దేరిన యర్థమే మలసి యప్పటి మరతురు గాని | ॥బయ॥ |
| పుట్టినదెల్లా భోగముకొరకే పుట్టిన భోగము పో దెపుడు పట్టి యీమాఁటలే పలుకుదు రిందరు మట్టులేక ఇది మరతురు గాని | ॥బయ॥ |
| కర్మము శ్రీవేంకటపతి కార్యము కర్మము దేహికిఁ గాణాచి ధర్మ మీదేవుని దాస్యం బందురు మర్మము లోకులు మరతురు గాని | ॥బయ॥ |


