అధ్యాత్మ సంకీర్తన
రేకు: 198-2
సంపుటము: 2-503
రేకు: 198-2
సంపుటము: 2-503
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మాళవిగౌళ
| ఇట్టె మమ్ము రక్షించుట యేమిదొడ్డ నీకు నేఁడు బట్టబాయిటనే నీవు పదిరూపు లైతివి | ॥పల్లవి॥ |
| చదువుల చిక్కుదిద్ది చక్కఁగఁ జేసితివి మొదలఁ గుంగినకొండ మోఁచి యెత్తితి పొదిగి చేపట్టి తెచ్చి భూమి వుద్ధరించితివి అదనునఁ బ్రహ్లాదు నట్టె మన్నించితివి | ॥ఇట్టె॥ |
| అడుగులు మూఁటనే యఖిలము గొలచితి బడిబడినే రాచపగ నీఁగితి బెడిదపు లంక విభీషణు నేలించితివి అడరి పాండవులదిక్కై నిలిచితివి | ॥ఇట్టె॥ |
| త్రిపుర కాంతలగుట్టు దీర బోధించితివి వుపమఁ గలికిరూపై యున్నాఁడవు ఇపుడు శ్రీవేంకటేశ యేలితివి లోకాలెల్ల యెపుడు నుతులకు నిరవైతివి | ॥ఇట్టె॥ |


