అధ్యాత్మ సంకీర్తన
రేకు: 200-6
సంపుటము: 2-519
రేకు: 200-6
సంపుటము: 2-519
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేసాళం
| కడనుండి చూచే నీకుఁ గనికరమైతేఁ గన- బడి నన్నుఁ గావు నీతో బలిమేలే | ॥పల్లవి॥ |
| వొడలు మోచినయది యొకయపరాధము అడరి సంసారినౌటె యపరాధము బడి నిని పఱచిన పాట్లఁ బడకపోడు (దు?) యెడనీకు మొరవెట్ట నిఁకఁ జోటేదయ్యా | ॥కడ॥ |
| అన్నపానములు గొన్న దది యొక్కనేరమి వున్నతి సంపదఁ బొందు టొకనేరమి యిన్నియు ననుభవించి యిఁక నొల్లనంటేఁ బోదు విన్నపాలు సేసి నీతో విసుగఁ జోటేది | ॥కడ॥ |
| మదిలో నీవుండగాను మఱచిన దొకకల్ల అదనఁ గర్మాధికారనౌ టొకకల్ల యెదుట శ్రీవేంకటేశ యిట్టె నన్నుఁ గాచితివి తుద కెక్కితిమి యింకఁ దొలఁగఁగవలెనా | ॥కడ॥ |


