అధ్యాత్మ సంకీర్తన
రేకు: 217-2
సంపుటము: 3-91
రేకు: 217-2
సంపుటము: 3-91
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: వరాళి
| చేసినట్టే సేసుఁ గాక చింత మాకేలా వాసీ వంతూ నతనిదే వట్టి జాలి యేలా | ॥పల్లవి॥ |
| కర్మమూలమైనవి యీ కాయపువ ర్తనలెల్లా ధర్మమూలమైనది యీ దైవికము మర్మమైన వాఁడొక్కఁడే మనసులోనున్న హరి నిర్మిత మాతనిదింతే నేర నేనెంతవాఁడ | ॥చేసి॥ |
| ధనమూలమైనది యీ తగిన ప్రపంచమెల్లా తనువు మూలమైనది యీ తపసులెల్లా ననిచి యీ రెంటికిని నారాయణుఁడే కర్త కొనమొద లాతనిదే కొసరు మాకేల | ॥చేసి॥ |
| భోగమూలమైనది యీ పొందైన సంసారము యోగమూలము విరతి కొక్కటైనది యీ గతి శ్రీవేంకటేశుఁ డెట్టు వలసినఁ జేసు బాగులుగా నీతని శ్రీపాదమే మా దిక్కు | ॥చేసి॥ |


