అధ్యాత్మ సంకీర్తన
రేకు: 221-1
సంపుటము: 3-114
రేకు: 221-1
సంపుటము: 3-114
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
| చూడ నరుదాయనమ్మ సొరిది నందరికిని వేడుకతో వచ్చి సేవించేరు బ్రహ్మాదులు | ॥పల్లవి॥ |
| కోరి చంద్రుఁడుదయించ గోకులచంద్రుడు వుట్టె- నేరీతి నీతఁడు నాతఁ డేమౌదురో వారిధి కొడుకతఁడు వారిధి యల్లుఁ డీతఁడు యీరీతి నీతఁడాతని కేలికాయఁ గాని | ॥చూడ॥ |
| నల్లని వాఁడీతఁడాయ తెల్లని వాఁడతఁడాయ యెల్లవారికిఁ జూడ వీరేమౌదురో అల్లాతఁడే యమృతము అమృతనాథుఁడితఁడు చల్లనైన హరితోడ సరిగాఁడుఁ గాని | ॥చూడ॥ |
| ఆతఁడు పూర్వాద్రిమీఁద నమరెఁ నిందరుఁ జూడ నీతఁడు శ్రీవేంకటాద్రి నిరవైనాఁడు యేతుల వుబ్బుసగ్గులు యిలమీఁద నాతనికి చైతన్యమెప్పు డీతఁడు సింగారవిభుఁడుగాని | ॥చూడ॥ |


