అధ్యాత్మ సంకీర్తన
రేకు: 221-3
సంపుటము: 3-116
రేకు: 221-3
సంపుటము: 3-116
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
| నీవు దేవుఁడవు నే నొక జీవుఁడ యీ విధి నిద్దరి కెంతంతరువు | ॥పల్లవి॥ |
| పొడమిన జగములు పుట్టెడి జగములు గుడిగొనె మీ రోమకూపముల యెడయక నీరూప మేమని ధ్యానింతు అడరి మీవాఁడ నేననుటే కాక | ॥నీవు॥ |
| మునుపటి బ్రహ్మలు ముందరి బ్రహ్మలు మొనసి మీ నాభిని మొలచేరు ఘనుఁడవు నిన్నేగతి నేఁ దెలిసెద అనువుగ మిము శరణనుటే కాక | ॥నీవు॥ |
| సహజానందము సంసారానంద- మిహముఁ బరముగా నిచ్చేవు అహిపతి శ్రీవేంకటాధిప నీకృప మహిలో సేవించి మనుటే కాక | ॥నీవు॥ |


