అధ్యాత్మ సంకీర్తన
రేకు: 223-2
సంపుటము: 3-127
రేకు: 223-2
సంపుటము: 3-127
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేవగాంధారి
| అఱిముఱిఁ జూడఁబోతే నజ్ఞాని నేను మఱఁగు చొచ్చితి మీకు మహిలో నారాయణా | ॥పల్లవి॥ |
| నిన్ను ధ్యానము సేసీని నిచ్చనిచ్చఁ దాళ్లపాక- అన్నమయ్యఁగా రెదుట నదిగోవయ్య పన్ని యాతనినే చూచి పాతకులమైన మమ్ము మన్నించవయ్య వో మధుసూదనా | ॥అఱి॥ |
| సంకీర్తనలు సేసీ సారెఁ దాళ్లపాకన్నయ్య అంకెల నీసన్నిధినే అదిగోవయ్య అంకించి నే వారివాఁడనని దుష్టుడనైనా నా- సంకె దీరఁ గావవయ్య సర్వేశ్వరా | ॥అఱి॥ |
| పాదాలం దున్నాఁడు దాళ్లపాకన్నమయ్య మీకు ఆదరాన ముక్తుఁడై అదిగోవయ్య యీదెస శ్రీవేంకటేశ యీసమ్మంధాననే నన్ను నీదయపెట్టి రక్షించు నెమ్మది భూరమణా | ॥అఱి॥ |


