Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 224-3
సంపుటము: 3-134
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
పలుమారు వాదమేల పంతమేమి వచ్చె నీ(మీ?)కు
చలమో ఫలమో సాధించుకోరయ్యా
॥పల్లవి॥
ధరమీఁదఁ జేయఁబోతే తగు పుణ్యములు లేవా
హరిదాసుఁడయ్యే పుణ్యమందుటఁ గాక
సురలు బ్రహ్మాదులును చూడఁగా నే పొడవున
తిరమై యున్నారో తెలుసుకోరయ్యా
॥పలు॥
మాపుదాఁకా సలిగెలు మహిమలు లేవా
శ్రీపతిదాసులై యంత చెల్లదుఁ గాక
చేపడిన మాత్రమున చేటులేని పదవుల
యేపున నెవ్వరున్నారో యెరుఁగరయ్యా
॥పలు॥
యేవలఁ గొలువఁబోతే నెందరు దైవాలు లేరు
శ్రీవేంకటేశువలె రక్షించరుఁ గాక
కోవరమై యేఁటనేఁటాఁ గోరి వరములకుఁగా
కావించి పరుష వచ్చేకత చూచుకోరయ్యా
॥పలు॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము