అధ్యాత్మ సంకీర్తన
రేకు: 226-4
సంపుటము: 3-147
రేకు: 226-4
సంపుటము: 3-147
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
| విన్నపము లేమి సేసే వేగినంతాను మన్నించి రక్షించే నీ మహిమలే ఘనము | ॥పల్లవి॥ |
| నీవంక నేరమి గద్దా నేనే అపరాధిని దేవ నే జడుఁడఁగాన తెలుసుకోను వావాత మీగురుఁ డాడేవాక్యము నీయాధీనము పావనమైన నీపలుకెల్లా సత్యము | ॥విన్న॥ |
| మంచితనమల్లా నీదె మాయదారివాఁడ నేను చంచలుఁడఁ గనక వివా(చా?)రించుకోను అంచల నీదాసుని ఆనతి యమోఘము యెంచ నీవిచ్చిన వరమెం(మిం?)దుకంటే బలువు | ॥విన్న॥ |
| కరుణెల్లా నీసొమ్ము కఠినచిత్తము నాది నరుఁడఁ గనక అట్టె యరసుకోను పరగ మా జనకుని ప్రతిజ్ఞయు నీపంపు నిరతి శ్రీవేంకటేశ నీపంతము సతము | ॥విన్న॥ |


