అధ్యాత్మ సంకీర్తన
రేకు: 236-3
సంపుటము: 3-206
రేకు: 236-3
సంపుటము: 3-206
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
| అక్కటా నీమాయ కగపడె జీవుఁడు యెక్కువతక్కువ లివి యేమీఁ దలపోయఁడు | ॥పల్లవి॥ |
| గొందినున్న స్వర్గము గోరి పుణ్యము సేయును యెందో తన వ్రాఁతఫల మెరఁగడు సందడించి మరునాఁటి చవులకే కూడపెట్టు పొంది మింగిన కళ్ళపులుసర మెంచఁడు | ॥అక్క॥ |
| అప్పటి దేహసమ్మంధపాలికే మనసు పెట్టు తప్పిపోయినవారలఁ దగులఁడు కప్పుకొనే కోకలకే కడఁగి చేతులు చాఁచు చిప్పిలఁ దొల్లి చించివేసినవెన్నో యెంచఁడు | ॥అక్క॥ |
| యెదిటిగృహారామాలివే తనకాణాచను చెదరి కలలోనివి చేపట్టడు వెదకు వైకుంఠపు విష్ణుమూ ర్తిఁ గనేనని హృదయములో శ్రీవేంకటేశుఁ జూడనెంచఁడు | ॥అక్క॥ |


