అధ్యాత్మ సంకీర్తన
రేకు: 237-1
సంపుటము: 3-210
రేకు: 237-1
సంపుటము: 3-210
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ధన్నాసి
| ఇది కల్లయనరాదు యిది నిశ్చయింపరాదు పదిలానఁ గొలువఁగా ప్రత్యక్షమయ్యేవు | ॥పల్లవి॥ |
| యెదలో నుండుదువని యిన్ని వేదాలు చెప్పగా వెదకి ధ్యానము సేతు వెస గనుఁగొంట లేదు చెదర కందే మరి జీవుఁడు నున్నాఁ డందురు పదిలముగాఁ జూతు భావించరాదు | ॥ఇది॥ |
| అంతటా నుందువని ప్రహ్లాదుఁడు చెప్పెననఁగా చింతించి పట్టఁదలఁతు చేతికిఁ జిక్కుట లేదు సంతత జ్ఞానాన నీ సాకారమున్నదందురు మంతనానఁ బిల్తు నొకమాట వినఁబడదు | ॥ఇది॥ |
| రవిలో నుందువని సురలు నిన్నుఁ గొలువఁగా తవిలి పూజించేనంటే దగ్గరి వచ్చుట లేదు యివల శ్రీవేంకటాద్రి నిరవై నీవున్నాఁడవు తివిరి సేవించితిమి ద్రిష్టమాయ మాకు | ॥ఇది॥ |


