అధ్యాత్మ సంకీర్తన
రేకు: 237-5
సంపుటము: 3-214
రేకు: 237-5
సంపుటము: 3-214
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
| పామరుల కెంతైనా ఫలియించనేరదు శ్రీమాధవ నీవు దయసేసితే నీడేరును | ॥పల్లవి॥ |
| అన్నిటా దైవముఁ దమ్ము నందరు నెరుఁగుదురు యెన్నుక వావివర్తన లెరుఁగుదురు పన్ని జననమరణభయము లెరుఁగుదురు వన్నెల నెరిఁగెరిఁగి వలలఁ జిక్కుదురు | ॥పామ॥ |
| విందురు పురాణాలు విందు రుపదేశాలు విందురు తొల్లిటివారి విచారాలు విందురు స్వర్గనరకవిభవము లన్నియును మందలించి వినివిని మాయకు లోనౌదురు | ॥పామ॥ |
| నడతు రాచారమున నానాదానాలుఁ జేతురు విడువక తీర్థయాత్ర వెసఁ జేతురు యెడయక శ్రీవేంకటేశ నీవుండఁగఁ దప- మడవులఁ జేసిచేసి అలయుచుండుదురు | ॥పామ॥ |


