అధ్యాత్మ సంకీర్తన
రేకు: 239-4
సంపుటము: 3-225
రేకు: 239-4
సంపుటము: 3-225
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
| ఎవ్వరి వసము గెల్వ నింతా వీనిమయమే యివ్వల నీవు గాచితేనేమో కాని | ॥పల్లవి॥ |
| వొక్కలోభము నెంచితే వొగి లోకమెల్లాఁ దానే యెక్కడ చూచినాఁ దానే యీదీపనము వెక్కసమైనది తానే వేగిలేచి సేసేపని తక్కక యిన్నిటా నెట్టు తప్పించుకోవచ్చును | ॥ఎవ్వ॥ |
| పలుమారు వచ్చీఁదానే పనిలేని పరాకు వళచుకొన్నది తానే వట్టిభీతి నిలుచుకున్నది తానే నిలువుననే సిగ్గు మెలుపున నెటువలె మెదలఁగవచ్చును | ॥ఎవ్వ॥ |
| కనుగొంటే నెందూఁ దానే కార్పణ్యము దైన్యము అనిశము మించీఁ దానే యాచకత్వము నను నేలకొంటి విదే నమ్మితి శ్రీవేంకటేశ జనుఁడను యివి నేను సాధించుటెట్టు | ॥ఎవ్వ॥ |


