అధ్యాత్మ సంకీర్తన
రేకు: 21-3
సంపుటము: 1-127
రేకు: 21-3
సంపుటము: 1-127
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
| ఆదిదేవుఁడై అందరి పాలిటి- కీ దేవుఁడై వచ్చె నితఁడు | ॥ఆది॥ |
| కోరిన పరమయోగుల చిత్తములలోన యేరీతి నుండెనో యీతఁడు చేరవచ్చిన యాశ్రితులనెల్లఁ బ్రోవ యీరీతి నున్న వాఁడీతడు | ॥ఆది॥ |
| కుటిల దానవుల [1]కోటానఁగోట్ల యెటువలెఁ [2]ద్రుంచెనో యీతఁడు ఘటియించి యిటువంటి కారుణ్యరూపుఁడై యిటువలె నున్న వాఁడీతడు | ॥ఆది॥ |
| తక్కక బ్రహ్మాండతతులెల్ల మోచి తా- నెక్కడ నుండెనో యీతఁడు దిక్కుల వెలసిన తిరువేంకటేశుఁడై యిక్కడ నున్న వాఁడీతఁడు | ॥ఆది॥ |
[1] ‘లఁగోటాన’ పూ.ము.పా.
[2] ‘దృంచె’ రేకు.


