అధ్యాత్మ సంకీర్తన
రేకు: 242-2
సంపుటము: 3-240
రేకు: 242-2
సంపుటము: 3-240
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
| దేవా నీవే యిన్ని చందముల తిరముగ మహోపకారి వైతివి యేవలనైనా నీవేకాక భువి నింతటివారలు యిఁకఁ గలరా | ॥పల్లవి॥ |
| జనులకు నీవే వొక్కొకచోటను శాస్త్రార్థములై కడఁగుదువు తనియక నీవే మరి వారికి బొధకులఁ గొందరినిఁ గల్పింతువు మనసులో నంతలో వొడఁబడికె చేసి మలయుచు నీవే నిలుతువు కనుఁగొన నీవే సుజ్ఞానమార్గము కైవసముగాఁ దెలుపుదువు | ॥దేవా॥ |
| కడఁగి యప్పటి నివే యజ్ఞాదికర్మఫలములై వుండుదువు తడయక నీవే తిరుపతుల దేవతామూర్తులై పొడచూపుదువు యెడయక నీవే తపోమహిమలై యెదుటనే తార్కాణ లౌదువు వొడలై నీవే యిహపరములకును వొడిగట్టి సాధింపింతువు | ॥దేవా॥ |
| ఆవేళ నీవే తత్త్వనిర్ణయము నాధారమునై యేర్పరతువు నీవే కమ్మటి ఆచారవిధులకు నియమములెల్లా నేర్పుదువు భావింప నీవే అలమేల్మంగకుఁ బతివై శ్రీవేంకటేశ రక్షింతువు జీవుల కంతర్యామివై నీవే శిష్టులఁ బరిపాలింతువు | ॥దేవా॥ |


